షాకింగ్ : ఏపీ హైకోర్టులో 16 మందికి కరోనా పాజిటివ్..
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 16 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు బుధవారం(జూలై 1) హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్‌ ప్రకటించారు. హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టుల్లో కూడా కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు. అత్యవసర పిటిషన్‌లను ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చునని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.Source link